కరీంనగర్ లో ఉద్రిక్తత.. కలెక్టరేట్ ముట్టడికి CPI యత్నం

కలం, కరీంనగర్ బ్యూరో : ​ఇంధన, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీపీఐ (CPI) ఆధ్వర్యంలో కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ ఎదుట పార్టీ శ్రేణులు బుధవారం ఆందోళన చేపట్టారు. ​సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నాయకత్వంలో కార్యకర్తలు కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. అనంతరం చాడ వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో పలువురికి గాయాలయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>