epaper
Monday, February 23, 2026
epaper

సూపర్ సిక్స్ ఎక్కడ..? కూటమి బడ్జెట్‌పై జగన్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేవిధంగా ఉందని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)  విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను (Super Six Guarantees) తుంగలో తొక్కి, బడ్జెట్‌లో వాటి ఊసే లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు వరుసగా వెన్నుపోటు పొడవడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, ఇది కేవలం అబద్ధాల పునాదులపై నిర్మించిన బడ్జెట్ అని అన్నారు.

మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబు (Chandrababu) అవుతాడు, అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అని జగన్ ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో వంచనే కనిపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలను అస్తవ్యస్తం చేస్తూ, కొత్త పథకాలకు నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.

రాష్ట్ర పాలనను గాలికొదిలేసి మంత్రులు విదేశీ పర్యటనల్లో మునిగిపోతున్నారని జగన్ విమర్శించారు. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కొలంబోలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లడాన్ని జగన్ (YS Jagan) ప్రస్తావించారు. దేశంలో సమస్యలు ఉంటే కొలంబోలో మ్యాచ్ చూడాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. టీవీలో చూస్తే మ్యాచ్ కనిపించదా? నేనూ నిన్న టీవీలోనే చూశాను” అని లోకేశ్‌పై సెటైర్లు వేశారు. లోకేశ్ ఒక పూట విజయవాడలో, మరో పూట హైదరాబాద్‌‌లో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు.

Read Also: హెరిటేజ్‌కు ఇందాపూర్ కో ప్రొడ‌క్ట్స్: మంత్రి స‌త్య‌కుమార్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>