కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ హాకీ (Pakistan Hockey) లో సంచలనం. పాక్ హాకీ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి తారిఖ్ బుగ్టీ రిజైన్ చేశారు. ఇదే సమయంలో జాతీయ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్‌పై రెండేళ్ల నిషేధం విధించినట్లు ఫెడరేషన్ వెల్లడించింది. బుగ్టీ తన రాజీనామాను ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీష్‌కు సమర్పించాడు. తన హయాంలో పాక్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్లో 18 నుంచి 13కు చేరిందని పేర్కొన్నాడు. రెండు సంవత్సరాలు జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేశానని తెలిపాడు. హాకీ కోసం రూ.250 మిలియన్లు కేటాయించి విడుదల చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఆస్ట్రేలియా టూర్ సమయంలో పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్‌తో పరిపాలనా ఇబ్బందులు ఎదురయ్యాయని బుగ్టీ అంగీకరించాడు (Pakistan Hockey). సొంత నిధుల కొరత సమస్యగా మారిందన్నాడు. ఇటీవల జరిగిన క్రమశిక్షణ లోపాలపై ఉన్నతస్థాయి విచారణ కోరాడు. రాబోయే క్వాలిఫయర్లలో జట్టు మెరుగ్గా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పరిణామాలు ఎఫ్ఐహెచ్ ప్రొ-లీగ్ ఆస్ట్రేలియా లెగ్ తర్వాత చోటుచేసుకున్నాయి. హోటల్ బుకింగ్స్ రద్దు కావడంతో ఆటగాళ్లు తాత్కాలిక వసతుల్లో ఉండాల్సి వచ్చినట్లు సమాచారం. మైదానంలోనూ జట్టు ఆస్ట్రేలియా, జర్మనీపై పరాజయాలు చవిచూసింది. ముందు రోజుల్లో బెల్జియం, స్పెయిన్, భారత్, ఇంగ్లండ్ జట్లతో మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.
Read Also: 2-0 లీడ్ వృథా.. చివర్లో అట్లెటికోకు షాక్!
Follow Us On : WhatsApp


