Mobile Popup Ad
Mobile Popup Ad

2-0 లీడ్ వృథా.. చివర్లో అట్లెటికోకు షాక్!

కలం, వెబ్​ డెస్క్​: చాంపియన్స్ లీగ్ ప్లే-ఆఫ్ తొలి లీగ్ మ్యాచ్​లో చివరి నిమిషం గోల్​​తో అట్లెటికో (Atletico Madrid) చేతిలో ఉన్న విజయం జారిపోయింది. ఆట మొదటి అర్ధభాగం వరకు 2-0 ఆధిక్యంలో ఉన్న స్పానిష్ జట్టు చివరికి 3-3తో సరిపెట్టుకుంది. మ్యాచ్ ఫస్ట్ హాఫ్‌లో అట్లెలికో మాడ్రిడ్ ఆధిపత్యం చాటింది. జూలియన్ అల్వారెజ్ పెనాల్టీతో జట్టు ఖాతా తెరిచింది. ఆ తర్వాత అడెమోలా లుక్‌మన్ గోల్‌తో స్కోరు 2-0కి చేరింది. రెండో భాగంలో క్లబ్ బ్రూజ్ పోరాటం మొదలైంది. రఫెల్ ఒన్యెడికా, నికోలో ట్రెసోల్డీ గోల్స్‌తో స్కోరు 2-2 అయింది. అనంతరం జోయెల్​ ఓర్డోనెజ్​ గోల్‌తో అట్లెటికో మళ్లీ ముందంజలోకి వచ్చింది.

అయితే 89వ నిమిషంలో క్రిస్టోస్ జోలిస్ గోల్ చేసి స్కోర్​ సమం చేశాడు. మొదట ఆఫ్‌సైడ్‌గా ప్రకటించినా, వీఏఆర్ సమీక్ష తర్వాత గోల్‌గా ఖరారైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోకె మాట్లాడుతూ రెండు గోల్స్ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయామని అన్నాడు. అయితే, ఆ జట్టు (Atletico Madrid) కోచ్ డియాగో సిమియోన్ ఇది తీవ్ర పోరాటమని, ఫలితం సమంజసమని అభిప్రాయపడ్డాడు. బ్రూజ్ కోచ్ ఇవాన్ లెకో జట్టు ధైర్యంగా తిరిగి వచ్చిందని తెలిపాడు. రెండో లెగ్‌లో అట్లెటికో ఫేవరెట్ అయినా, తాము పోరాడతామని చెప్పాడు. ఇప్పుడు నిర్ణయం రెండో లెగ్‌లోనే.. చివరి 16వ బెర్త్ కోసం పోటీ మరింత ఉత్కంఠగా మారింది.

Read Also: అభిషేక్ అలా ఆడితేనే గట్టెక్కగలడు: ఇర్ఫాన్ పఠాన్​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>