హెరిటేజ్‌కు ఇందాపూర్ కో ప్రొడ‌క్ట్స్: మంత్రి స‌త్య‌కుమార్‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఇందాపూర్ డెయిరీ (Indapur Dairy)పై మంత్రి స‌త్య‌కుమార్ (Satyakumar) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఇందాపూర్ నుంచి కేవలం కో ప్రొడక్ట్స్ మాత్రమే హెరిటేజ్‌(Heritage)కి వస్తాయ‌ని వెల్ల‌డించారు. హెరిటేజ్‌కు, తిరుమల లడ్డుకు సంబంధమే లేద‌ని స్ప‌ష్టం చేశారు. వైసీపీ నేత‌లు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుమలకు హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేసిందా? అని ప్ర‌శ్నించారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్నీ డైవర్ట్ చేసేందుకే వైసీపీ నేతలు ఇందాపూర్ డెయిరీని ముందుకు తీసుకొస్తున్నార‌ని ఆరోపించారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదిక‌గా ఇందాపూర్‌కు హెరిటేజ్‌కు సంబంధమే లేద‌ని చెప్పారు. దీనికి భిన్నంగా స‌త్య‌కుమార్ కేవ‌లం ఇందాపూర్ నుంచి హెరిటేస్‌కు కో ప్రొడ‌క్ట్స్ వ‌స్తాయ‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>