పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి.. చర్యలేవి చంద్రబాబు! : జగన్

కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ఓ ఎంపీ డ్రగ్స్ తీసుకోని పట్టుబడితే సీఎం చంద్రబాబు చర్యలేవి అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) ప్రశ్నించారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలతో నేడు జగన్ సమావేశమై డ్రగ్స్ వ్యహహారంపై స్పందించారు. ఈ వ్యవహారం పుట్టా మహేశ్ తో మొదలై.. పుట్టా మహేశ్ తోనే ఆగిపోలేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల పట్ల సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేవలం షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అత్యాచారాలు, మోసాలపై కమిటీలు వేసి కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

కోనేటి ఆదిమూలం మహిళలపై లైంగిక దాడి చేస్తే యాక్షన్ ఏది చంద్రబాబు (Chandrababu) అని జగన్ ప్రశ్నించారు. గుమ్మడి సంధ్యారాణి పీఏ మీద, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు చర్యలు తీసుకోకుండా నేతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కాగా, చంద్రబాబు వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండేళ్లే అని.. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలున్నాయని తెలిపారు. మధ్యలో తన పాదయాత్ర ఉంటుందని.. జగన్ ((YS Jagan)) 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని చెప్పారు. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని వెల్లడించారు.

Read Also: అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబానికి మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>