Mobile Popup Ad
Mobile Popup Ad

ఆది శ్రీనివాస్ వాచ్ వ్యవహారం.. BRSపై కాంగ్రెస్ ఫైర్

కలం, వెబ్ డెస్క్:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభను తప్ప దోవ పట్టిస్తు అపద్దాలు మాట్లాడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. వాళ్ళు చేసిన విధ్వంసాన్ని విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Adi Srinivas) వాచ్ ఖరీదు కోటి రూపాయలు అని కేటిఆర్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దపు ప్రచారాలను కేటిఆర్ పింక్ మీడియా ఆపాలన్నారు. ఆది శ్రీనివాస్ క్యారెక్టర్ ను దెబ్బ కొట్టే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆది శ్రీనివాస్ పై చేస్తున్న ఆరోపణలు వెనక్కి తీసుకొని కేటిఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ.. విప్ ఆది శ్రీనివాస్ ఖరీదు 90లక్షల రూపాయలు అని కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కేటిఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao).. ఈ వాచ్ ని తీసుకొని రూ.20వేలు ఇవ్వండని అన్నారు. ఆది శ్రీనివాస్ సభలో యాక్టివ్ గా మాట్లాడుతుండని కేటిఆర్ ఆయనపై విష ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు. గతంలో సీతక్కను, ఇప్పుడు విప్ ఆది శ్రీనివాస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని సొంత చెల్లె కవిత వ్యాఖ్యలకు ఇప్పటి వరకు కేటీఆర్ సమాధానం చెప్పలేదని దుయ్యబట్టారు.

దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్స్ఆప్ ద్వారా కేటీఆర్ తనపై విష ప్రచారం చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) ఆరోపించారు. తాను పెట్టుకున్న మైకేల్ కోర్స్ వాచ్ ను ఓ టీవీ ఛానెల్ లో 90 లక్షల రోలెక్స్ వాచ్ పెట్టుకొని వచ్చారని ప్రచారం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ రూల్స్ కు విరుద్ధంగా తనపై తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో తనపై దుష్ప్రచారం చేసిన కేటిఆర్ పై స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. బీఆర్ఎస్ విష ప్రచారాన్ని ప్రజలకు చెప్తూ కుంభకోణాలను బయట పెడుతుంటే.. కేటిఆర్ తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నాడని దుయ్యబట్టారు. లిక్కర్ కేసులో తనకు కూడా అప్రతిష్ట పాలు చేస్తున్నారని కవిత చెప్పిందని గుర్తు చేశారు. ఓర్వలేక తమ నిబద్ధతను ప్రజల్లో కించపరిచే విధంగా కేటిఆర్ చేస్తున్నారని ఆరోపించారు. ఎంత విషప్రచారం చేసినా బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతానని.. బీఆర్ఎస్ కు బయపడి వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.

Read Also: ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు వసూలు.. నిందితుల అరెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>