epaper
Sunday, February 22, 2026
epaper

దేశం పరువు తీస్తారా! : కాంగ్రెస్​ తీరుపై జగన్​ ఫైర్​

కలం, వెబ్​ డెస్క్​ : విదేశీ ప్రతినిధులు హాజరైన ప్రతిష్టాత్మక AI సమ్మిట్ (AI Impact Summit) వేదికగా యూత్ కాంగ్రెస్ చేసిన నిరసన కార్యక్రమంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) స్పందించారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రాజకీయాల కంటే దేశ గౌరవమే ముఖ్యం అని పేర్కొన్నారు.

సదస్సులో జరిగిన పరిణామాలు మనందరినీ తలదించుకునేలా చేశాయని జగన్ అన్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించడం సరికాదని ఆయన తెలిపారు. ప్రపంచం ముందు మన దేశం గురించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా ప్రవర్తించడం ఎవరికీ మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

దేశం వెలుపల, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు మనమంతా ఒక్కటిగా ఉండాలని, ఐక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పోరాడాలి కానీ, ఇలాంటి కీలక సదస్సులను రాజకీయం కోసం వాడుకోవడం వల్ల దేశానికి జరిగే నష్టం పూడ్చలేనిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన రాజకీయ పోరాటాలు దేశ గౌరవానికి భంగం కలిగించకూడదని ఆయన ఈ సందర్భంగా జగన్​ (YS Jagan) తెలిపారు.

 Read Also: మాజీ ఎంపీ కి బిగ్ షాక్: వేలానికి ఆస్తులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>