మాజీ ఎంపీ కి బిగ్ షాక్: వేలానికి ఆస్తులు

కలం, వెబ్​ డెస్క్​ : కర్నూలు (Kurnool) మాజీ ఎంపీ బుట్టా రేణుక (Butta Renuka), ఆమె భర్త నీలకంఠంకు సంబంధించిన ఆస్తులను వేలం వేయాలని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సదరు సంస్థ అధికారికంగా వేలం ప్రకటనను కూడా జారీ చేసింది. అయితే.. గతంలో వ్యాపార అవసరాల కోసం వీరు ఎల్‌ఐసీ (LIC) నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకున్నారు.

2018 సంవత్సరంలో బుట్టా రేణుక (Butta Renuka) దంపతులు సుమారు 340 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో సకాలంలో వాయిదాలు చెల్లించకపోవడంతో ఆ మొత్తం వడ్డీతో కలిపి భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆ రుణ భారం ఏకంగా 782.07 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇంత భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో వారు విఫలం కావడంతో, సంస్థ తన బకాయిలను వసూలు చేసుకోవడానికి వారి ఆస్తులను బహిరంగ వేలం వేయాలని నిర్ణయించింది.

 Read Also: పేలుళ్లకు కుట్ర.. ఢిల్లీలో హై అలర్ట్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>