epaper
Sunday, February 22, 2026
epaper

చాలా ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై కలిసి నటిస్తున్న కమల్-రజనీ

కలం, సినిమా : విశ్వనటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ (KH-RK Reunion).. ఈ ఇద్దరు లెజెండరీ నటులు కలిసి నటించి చాలా కాలమే అయింది. అప్పట్లో వీరి కాంబినేషన్ ఎంతటి సంచలనం సృస్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా చాలా కాలం తరువాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సేన్సెషన్ అనిరుధ్ (Anirudh) మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోకీ అనిరుధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. KH-RK Reunion వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

 Read Also: ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ గ్రాండ్ లాంచ్.. వేదిక ఎక్కడంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>