Mobile Popup Ad
Mobile Popup Ad

కల్తీ నెయ్యి పాపం నాపై నెట్టాలని చూస్తున్నారు : సీఎం చంద్రబాబు

కలం, డెస్క్ : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై (Tirumala Ghee Case) సీఎం చంద్రబాబు (Chandrababu) షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందని సిట్ చెప్పిందని.. కానీ వైసీపీ పచ్చి అబద్దాలతో తప్పించుకోవాలని చూస్తోందంటూ విమర్శించారు. ‘వైసీపీ చేసిన తప్పులను నాపై నెట్టాలని ఎన్నోసార్లు చూసింది. కానీ అవేవీ నిలబడలేదు. గతంలో వైఎస్ వివేకానంద మర్డర్ కేసును నాపై నెట్టేందుకు ట్రై చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి మీడియాలో రాతలు రాశారు. ప్రాణం పోయినా నేను తప్పు చేయను. వివేకా హత్య కేసులో దోషులు ఎవరో అందరికీ తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు దాని గురించి వైసీపీ నోరెత్తట్లేదు’ అంటూ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఇప్పుడు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసును కూడా తనపై నెట్టాలని చూస్తున్నారని.. అందుకే హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ ది మొదటి నుంచి నేర చరిత్రే అని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అరాచక కాండ గురించి అందరికీ సీఎం చంద్రబాబు తెలుసన్నారు. కూటమి పరిపాలనలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నామని.. కుల, మత విద్వేషాలకు తమ హయాంలో తావు లేదని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu).

Read Also: దేశం పరువు తీస్తారా! : కాంగ్రెస్​ తీరుపై జగన్​ ఫైర్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>