కలం, వెబ్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తన పాదయాత్ర ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది తన పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ నాయకులతో జరిగిన సమావేశంలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన పాదయాత్ర తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని హెచ్చరించారు. ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయిందని.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయని విమర్శించారు. తన పాదయాత్రతో ప్రజలతో మమేకం అవుతానని పేర్కొన్నారు.
మావిగన్ పై వెనక్కి తగ్గని జగన్
రాజధాని అమరావతిపై అనేది దోపిడీ, అవినీతికి స్కామ్ గా మారిందని జగన్ (YS Jagan) ఆరోపించారు. అమరావతి పేరు మీద అడ్డంగా దోచేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో తాను ప్రతిపాదించిన మావిగన్ కే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడం వల్ల ఖర్చు భారీగా అవుతుందనే.. చాలా తక్కువ ఖర్చు అయ్యే మావిగన్ ను సూచించినట్లు వెల్లడించారు. రాజధాని బెస్ట్ ఆప్షన్ గా ప్లాన్-A కింద వైజాగ్‌ను చెప్పామన్నారు. ఇందులో భాగంగా న్యాయ రాజధానిగా కర్నూలు, అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా సూచించామని చెప్పారు. అయితే ప్లాన్ -బీలో భాగంగా మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే రాజధాని గ్రోత్ కారిడార్‌గా మావిగన్‌ను సూచించినట్లు స్పష్టం చేశారు.
చంద్రబాబు అందుకే పట్టుబడుతున్నారు..?
అమరావతిలో నిరంతరం రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ కట్టే బదులు.. వీటికోసం రూ.2లక్షల కోట్లు భారాన్ని రాష్ట్రంపై వేసే బదులు, అందులో 10శాతం పెడితే చాలు బ్రహ్మాండమైన రాజధాని అవుతుందని మావిగన్ (MAVIGUN) ను సూచించినట్లు జగన్ అన్నారు. మచిలీ పట్నంలో పోర్టును ఇప్పటికే తాము ప్రారంభించామని గుర్తు చేశారు. ఇన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు, ప్రయోజనాలు ఉన్న మావిగన్ కాకుండా అమరావతే కావాలని చంద్రబాబు పట్టుబడుతున్నాడని.. కారణం ఏంటంటే.. అమరావతి పేరుతో దోచుకో.. దాచుకో.. పంచుకో కాన్సెప్ట్ కు తెరలేపాడమేనని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని పేరుతో కమిషన్లు నిరంతరం దండుకోవడమే చంద్రబాబు ప్లాన్ అని జగన్ వెల్లడించారు.
Read Also: సెలూన్ షాప్‌కు రూ.72 లక్షల జీఎస్టీ నోటీసులు
Follow Us On: X(Twitter)

