ఏబీఎన్ ఎండీకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు వైసీపీ అధినేత జగన్ (Jagan)  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక రాధాకృష్ణను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతామని హెచ్చరించారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనం పట్ల వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తమ ఇండ్లల్లోని మహిళలను ఉద్దేశించి రాధాకృష్ణ తప్పుడు వ్యాఖ్యలు చేశారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు నిరసన చేపట్టాయి. తాజాగా జగన్ ఇదే విషయంపై స్పందించారు.

ఇటీవల ఏబీఎన్‌లో వచ్చిన వీకెండ్ కామెంట్, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కొత్తపలుకులోని కొన్ని కామెంట్లపై వైసీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా టీడీపీ నేతల మహిళలను ఉద్దేశించి అనేక తప్పుడు కామెంట్లు చేశారని వారు ఉదహరిస్తున్నారు. వైసీపీకి ఓ న్యాయం.. టీడీపీకి మరో న్యాయం ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఓ మీడియా చానల్ ను టార్గెట్ చేసుకొని వైసీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది. ఇక వివాదం చినికిచినికి గాలివానగా మారింది. నేరుగా వైసీపీ అధినేతే (Jagan) రంగంలోకి దిగడం గమనార్హం.

గతంలో రాజకీయనాయకులు కేవలం విధానపరమైన అంశాల మీద చర్చలు జరిపేవారు. విమర్శించుకునేవారు కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. వ్యక్తిగత అంశాలు తెరమీదకు వస్తున్నాయి. రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాల గురించి వారి ప్రత్యర్థులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇక మీడియా సంస్థలు సైతం పారదర్శకంగా వ్యవహరించకుండా ఏదో ఒక రాజకీయపార్టీకి కొమ్ము కాస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో వేచి చూడాలి.

Read Also: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>