కలం, వెబ్ డెస్క్ : విజయవాడ(Vijayawada) లో ఓ చిన్న సెలూన్ షాప్ నిర్వాహకుడికి రూ.72 లక్షల జీఎస్టీ నోటీసులు (GST Notice) రావడం సంచలనంగా మారింది. పంజా సెంటర్‌లో సెలూన్ నిర్వహిస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తికి అకస్మాత్తుగా ఈ భారీ మొత్తం చెల్లించాలని జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్లు రికార్డుల్లో కనిపిస్తోందని, దానికి సంబంధించిన జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే తనకు ఎలాంటి ఐరన్ వ్యాపారం లేదని, తాను కేవలం సెలూన్ మాత్రమే నడుపుతున్నానని శ్రీనివాసరావు వాదిస్తున్నారు.
ఇటీవల ఆయన బ్యాంక్ ఖాతా అకస్మాత్తుగా నిలిపివేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుకు వెళ్లి విచారించగా, జీఎస్టీ అధికారుల ఆదేశాల మేరకు ఖాతాను హోల్డ్‌లో పెట్టినట్లు సిబ్బంది తెలిపారు. ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన శ్రీనివాసరావు, సంబంధిత అధికారులకు తన వివరణ ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: పాదయాత్ర ముహూర్తం ఫిక్స్ చేసిన వైఎస్ జగన్ !
Follow Us On: Pinterest

