కలం వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైఎస్ జగన్ ఎప్పుడు కనిపించే పొలిటికల్ లుక్‌లో కాకుండా జీన్స్, షూస్ వేసుకొని స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. వైఎస్ జగన్ శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి తన ఫ్యామిలీతో కలిసి యూరప్ పర్యటనకు బయలుదేరారు. రెండు వారాల పాటు ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటన కోసం జగన్ ఇంతకు ముందే కోర్టు నుంచి అనుమతులు తీసుకున్నారు. మరోవైపు జగన్ పర్యటనపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ఏపీ కన్నా బెంగళూరులోనే ఎక్కువ సమయం ఉంటున్నారని విమర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు పక్క దేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతులతోనే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

