సామాన్యులకు అందుబాటులో ఉంటా: ఖమ్మం కలెక్టర్

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భారీ ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఖమ్మం జిల్లాకు కొత్త కలెక్టర్‌గా (Khammam Collector) దివాకర్ నియమితులయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకకు చెందిన దివాకర్ ఇంజినీర్ గ్రాడ్యుయేట్, 2017 సివిల్స్‌లో విజయం సాధించారు. ఇప్పటివరకు ములుగు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన దివాకర్, ఖమ్మం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ​ములుగు గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లా కావడంతో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారం, విద్యా సౌకర్యాలు, వైద్య సేవల మెరుగుదలపై ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మ జాతర వంటి అతిపెద్ద ఈవెంట్లను సమన్వయం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అలాగే భూ సమస్యలు, పోడు భూములకు పట్టాల పంపిణీ వంటి అంశాలను చట్ట పరిధిలో పరిష్కరించారు. సామాన్యులకు అందుబాటులో ఉండే కలెక్టర్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ఈ అనుభవాలు ఖమ్మం జిల్లాకు చాలా ఉపయోగపడతాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా గిరిజన జనాభా అధికంగానే ఉంది. కాగా ఇప్పటివరకు కలెక్టర్‌గా పనిచేసిన అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టనుండటం గమనార్హం.

Read Also: కవిత వ్యాఖ్యలకు కేసీఆర్ రియాక్షన్‌పై ఉత్కంఠ

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>