జగిత్యాలలో ఘోరం: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య

కలం, వెబ్ డెస్క్​ : జగిత్యాల జిల్లా కోరుట్ల (Korutla) మండలం మాదాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన వైష్ణవి (YouTuber Vaishnavi)ని ఆమె భర్త హరిబాబు కిరాతకంగా హత్య చేశాడు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం పెను విషాదానికి దారితీసింది.

ఆవేశంతో ఊగిపోయిన హరిబాబు, గర్భిణి అన్న మానవత్వం కూడా లేకుండా భార్య వైష్ణవిపై (YouTuber Vaishnavi) కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఈ వార్త తెలియడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. తమ కుమార్తెను నిత్యం వేధించడమే కాకుండా, ఇలా పొట్టనబెట్టుకున్న హరిబాబుతో పాటు అతడి తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, లేనిపక్షంలో తామే న్యాయం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. స్కూటీ డిక్కీలోంచి రూ.8 లక్షలు చోరీ

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>