కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) లో పట్టపగలు దొంగలు చేతివాటం చూపించారు. నరసింహారెడ్డి అనే వ్యక్తి స్కూటీ డిక్కీ లోంచి ఎనిమిది లక్షల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం జహీరాబాద్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి డ్రా చేసుకొని వెళుతుండగా ఆయనను దొంగలు అనుసరించారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద స్కూటీ ని పార్క్ చేసి లోపలికి వెళ్ళి వచ్చేసరికి 8 లక్షల నగదును మాయం చేసి పరారయ్యారు దొంగలు. నగదు చోరీపై బాధితుడు నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: వేసవి వచ్చేసింది.. వార్డ్‌రోబ్‌లో ఈ మార్పులు చేసుకోండి
Follow Us On: Instagram

