Mobile Popup Ad
Mobile Popup Ad

బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావాలా.. భోజనం ఇలా తిని చూడండి..!

కలం, వెబ్ డెస్క్ : భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. ఇలా తరచూ జరిగితే ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి డయాబెటిస్‌ (Diabetes)కు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఆహారాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేకుండా, కేవలం భోజనం చేసే ‘వరుస’(Meal Order) ను మార్చడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని న్యూజెర్సీకి చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ అలేసియా రోనాల్ట్ సూచించారు. సాధారణంగా చాలామంది భోజనం ప్రారంభంలో అన్నం లేదా బ్రెడ్ వంటి పిండి పదార్థాలను తీసుకుంటారు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుందని ఆమె తెలిపారు. అందువల్ల ఈ అలవాటు మార్చుకోవాలని సూచించారు.

సరైన భోజన క్రమం ఇలా ఉండాలి:

ముందుగా కూరగాయలు తినాలి. ఆ తర్వాత ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. చివరగా పిండి పదార్థాలను తీసుకోవాలి. ఈ విధానం పాటించడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. గ్లూకోజ్ రక్తంలోకి క్రమంగా చేరుతుంది. ఫలితంగా శరీరానికి తక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటే కొవ్వు పేరుకుపోవడం తగ్గి బరువు తగ్గడానికీ సహాయపడుతుందని ఆమె తెలిపారు.

క్యాలరీల పరిమాణం మారకపోయినా, భోజనం చేసే క్రమంలో చిన్న మార్పు చేయడం ద్వారా మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఈ సరళమైన అలవాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>