బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) జంట చేసిన న్యాయ పోరాటానికి యూట్యూబ్ సైతం దిగొచ్చింది. వెంటనే డ్యామెజ్ కంట్రోల్‌ను స్టార్ట్ చేసేసింది. దాదాపు అనేక వీడియోల లింక్‌లను డిలీట్ చేయడమేకాకుండా.. పలు యూట్యూబ్ ఛానెళ్లను కూడా బ్లాక్ చేసింది యూట్యూబ్. అసలేమైందే.. ఏఐ సహాయంతో తమ మొఖాలు, పేర్లను వినియోగించిన వీడియోలు అనేకం యూట్యూబ్‌లో పోస్ట్ అయ్యాయి. వాటిని తొలగించాలని, తమ అనుమతి లేకుండా తమ ఫొటోలు, వీడియోలు వినియోగించారంటూ అభిషేక్, ఐశ్వర్య.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వీడియోలను పబ్లిక్ చేసినందుకు యూట్యూబ్, దాని మాతృసంస్థపై రూ.4 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేశారు. కేసు నమోదైన వెంటనే యూట్యూబ్ ఈ అంశంపై స్పందించింది. డ్యామేజ్ కంట్రోల్‌ను స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే 250కిపైగా లింక్‌లను తొలగించింది. ఇలాంటి కంటెంట్‌ను ప్రసారం చేసే ఛానల్స్‌ను కూడా బ్లాక్ చేసేసింది.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పెరుగుతున్న ఏఐ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులు ఎంతటి ప్రమాదంలో ఉందో అర్థం అవుతోందని న్యాయస్థానం పేర్కొంది. ఇటువంటి కంటెంట్ వాళ్ల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగానే అభిషేక్, ఐశ్వర్యలకు(Aishwarya Rai) సంబంధించిన ఏఐ కంటెంట్‌ను యూట్యూబ్(Youtube), గూగుల్(Google) సంబంధించి అన్ని ఫ్లాట్ ఫార్మ్‌ల నుంచి తొలగించడానికి 72 గంటల సమయం ఇచ్చింది. అయితే ఇప్పటికే తమ ఫొటోలు, వీడియోలను తమ అనుమతి లేకుండా వినియోగించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు ప్రముఖ నటులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారిలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ బిగ్ బీ కూడా ఉన్నారు. వారు అభ్యర్థించినట్లే హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది.

