చిక్కుడుగుంట బీటీపీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక – మణుగూరు సరిహద్దుల్లోని చిక్కుడుగుంట బీటీపీఎస్ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీ అదుపుతప్పి కల్వర్ట్‌ను ఢీకొనడంతో మణుగూరు మండలం శేషగిరినగర్‌కు చెందిన వృతిక్ (20) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో స్కూటీపై మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నట్లు సమాచారం. వారిని అంబులెన్స్ ద్వారా మణుగూరు (Manuguru) ఏరియా ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: రాష్ట్రానికి బిగ్ రిలీఫ్.. మెట్రో ఫస్ట్ ఫేజ్ అప్పులకు రుణం మంజూరు

Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>