రాజమండ్రిలో పవన్ కల్యాణ్ పర్యటన.. గోదావరి పుష్కర పనుల పరిశీలన

కలం, వెబ్ డెస్క్ : రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పర్యటించారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఘాట్‌ల వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలు, ఫోటో ప్రదర్శనను పవన్ కల్యాణ్ సమీక్షించారు. భక్తుల రాకపోకలు, సౌకర్యాల కల్పనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పుష్కర ఘాట్ నుంచి కోటి లింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణించి నదీ తీర అభివృద్ధి పనులను పరిశీలించారు. గోదావరి నదిలో కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆయన (Pawan Kalyan) ఆరా తీశారు. అలాగే నల్లకాలువ చెత్త శుద్ధి ప్లాంట్‌ను కూడా పరిశీలించిన డిప్యూటీ సీఎం, వ్యర్థాల నిర్వహణ, నదీ కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పుష్కరాల ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: జీవిత భాగస్వామితో అబద్ధాలు చెబుతున్నారా?.. అయితే జాగ్రత్త!

Follow Us On: X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>