Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రానికి బిగ్ రిలీఫ్.. మెట్రో ఫస్ట్ ఫేజ్ అప్పులకు రుణం మంజూరు

కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో  రైల్ ఫస్ట్ ఫేజ్‌ను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఆ కంపెనీకి ఈక్విటీ రూపంలో తీర్చాల్సిన అప్పులకు అవసరమైన రుణం మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) గత కొన్ని వారాలుగా చేస్తున్న కృషి ఫలించింది. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 13,500 కోట్ల మేర రుణం మంజూరైంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, వడ్డీ రేటు తదితరాలన్నింటిపై స్పష్టత వచ్చింది.

ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఐఆర్‌ఎఫ్‌సీ మధ్య సోమవారం అవగాహనా ఒప్పందం కుదరనున్నది. ఇందుకోసం రాష్ట్రం తరఫున చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ కార్పొరేషన్ ఎండీ, మరికొందరు అధికారులు ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఈ రుణానికి తోడు హెచ్ఎండీఏ సైతం రూ. 1,350 కోట్లను ప్రభుత్వానికి ఈ అవసరం కోసం సమకూర్చనున్నది.

Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

Read Also: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>