కేంద్ర ప్రభుత్వ విధానాలపై యువజన కాంగ్రెస్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మోదీ సర్కార్ పై యువజన కాంగ్రెస్ (Youth Congress) భగ్గుమంది. “మోడీ తలవంచితే దేశం తలవంచదు” అంటూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. వేలాది మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొని ఐక్యతను చాటారు. తెలంగాణ రాష్ట్రం అనేది కాంగ్రేస్ అధినేత సోనియా గాంధీ దయతో సాధ్యమైందే గానీ ఎవరైనా ఇచ్చిన భిక్ష కాదు అని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. లోక్ సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత ట్రేడ్ ఒప్పందాలు దేశ ఆర్థిక వ్యవస్థకు హానికరమని, వెంటనే వాటిని పునఃసమీక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ భాను చిబ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>