Mobile Popup Ad
Mobile Popup Ad

మహాధర్నాకు భారీగా నేతలు​: విపుల్ గౌడ్​ కు ప్రశంసలు

కలం, నిజామాబాద్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న యూస్ ట్రేడ్ డీల్ కారణంగా రైతులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని నిజామాబాద్ (Nizamabad) యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందానికి నిరసనగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ మహాధర్నాకు జిల్లా నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో భారీ సంఖ్యలో తరలివెళ్లారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చీబ్ ను విపుల్ గౌడ్ కలిశారు. జిల్లా నుండి కార్యకర్తలను భారీగా సమీకరించి ధర్నాను విజయవంతం చేసినందుకు విపుల్ గౌడ్ ను ఉదయ్ భాను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ మహాధర్నాలో జిల్లా కార్యవర్గ సభ్యులు అనుపల్ కిరణ్, ఆదిత్య పాటిల్, ఆకాష్ రెడ్డి, అబ్బోల్ల శ్రీకాంత్ తో పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు కార్తిక్ యాదవ్, మహీందర్, ప్రశాంత్, చరణ్ గౌడ్, మొయిన్, జిల్లా, మండల స్థాయి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>