గుడ్ న్యూస్ చెప్పిన దీపికా, రణవీర్ సింగ్ జోడి

కలం, వెబ్ డెస్క్ : అభిమానులకు దీపికా, రణవీర్ సింగ్ జంట గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా పదుకొణె (Deepika Padukone) మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని దీపికా పదుకొణె సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు తన కూతురు దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్టు కిట్ పట్టుకున్న ఫొటోను ఆమె ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. దీంతో పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా, దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ ల జోడికి నెట్టింట్లో ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి చేసిన చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావతి వంటి చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరిద్దరూ 2018 లో వివాహం చేసుకోగా.. 2024లో ఈ జంటకు కూతురు జన్మించింది. ఇదిలాఉంటే రణవీర్ సింగ్ ఇటీవల నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రానున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>