అభిషేక్ వైఫల్యాలకు కారణం చెప్పిన యోగరాజ్ సింగ్

కలం, స్పోర్ట్స్ : టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ అనేదే అభిషేక్‌కు తెలీదంటూ మండిపడ్డారు. ఆటపై ఫోకస్ తగ్గడం వల్లే వరల్డ్ కప్‌ స్టార్టింగ్‌లో అభిషేక్ అట్టర్ ప్లాప్ అయ్యాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అభిషేక్ వరుసగా మూడు సార్లు డకౌట్ కావడమే కాకుండా, అడపా దడపా రాణించడంపై యోగరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాడి దృష్టి మళ్లడం వల్లే వైఫల్యాలు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అభిషేక్ శర్మ సోషల్ మీడియా రీల్స్ చేయడంపై దృష్టి పెట్టడం సరికాదని యోగరాజ్ (Yograj Singh) అభిప్రాయపడ్డారు. క్రికెటర్లు రాత్రి 9 గంటలకే నిద్రపోయి, ఉదయం 5 గంటలకు లేచి ప్రాక్టీస్ చేయాలని సూచించారు. శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్ల ఏకాగ్రత కూడా పక్కదారి పడుతోందని ఆయన ఆరోపించారు. క్రమశిక్షణ లేకపోతే యువరాజ్ సింగ్ స్థాయికి చేరుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు.

ప్రస్తుత తరం క్రికెటర్లు పార్టీలు, డబ్బు, ఇతర వ్యాపకాల వల్ల ఆటపై పట్టు కోల్పోతున్నారని యోగరాజ్ విమర్శించారు. కేవలం సిక్సర్లు కొట్టి ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా, సింగిల్స్, డబుల్స్ తీయడంపై కూడా దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఆటను తక్కువ అంచనా వేయవద్దంటూ తాను వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపినా అభిషేక్ (Abhishek Sharma) తీరు మారడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచకప్ ముగియడంతో అభిషేక్ శర్మ త్వరలో జరగబోయే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also: ఒప్పందంపై లేట్ చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>