కలం, సినిమా : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi) పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. నేడు మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా.. దర్శకుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ పిక్స్ రిలీజ్ చేసి మహేశ్‌కు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. అలాగే వారణాసిలో మహేశ్ పోషిస్తున్న ‘రుద్ర’ పాత్ర గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘రుద్ర’ తనకంటే ఎంతో పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చేందుకు పుట్టిన వ్యక్తి అని.. తాను కోరుకోకపోయినా ఒక ప్రత్యేకమైన విధిని మోసుకెళ్లే పాత్రగా రుద్రను తీర్చిదిద్దినట్లు రాజమౌళి తెలిపారు. ఈ పాత్రలో తెలివితేటలు, సున్నితత్వం, ఆవేశం వంటి విభిన్న కోణాలు కనిపిస్తాయని వివరించారు. “ఎవరైనా కోపాన్ని, ఆవేశాన్ని చూపించగలరు. కానీ అదే సమయంలో ఆవేశంతో పాటు సున్నితత్వాన్ని చూపించగల నటులు చాలా తక్కువ మంది ఉంటారు. మహేశ్ రుద్ర పాత్రకు ఆ ప్రత్యేకతను తీసుకొచ్చారు” అని రాజమౌళి ప్రశంసించారు.
‘వారణాసి’ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను ఆఫ్రికా షెడ్యూల్లో చిత్రీకరించినట్లు రాజమౌళి తెలిపారు. కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాలలో షూటింగ్ అనుభవం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. అక్కడి ప్రకృతి, విశాలమైన భూభాగం సినిమాకు ప్రత్యేకమైన అనుభూతిని అందించాయని పేర్కొన్నారు. “నా ముందు కనిపించిన దృశ్యాలను 1.43:1 IMAX ఫ్రేమ్ కూడా పూర్తిగా పట్టుకోలేదేమో అనిపించిన సందర్భాలు ఉన్నాయి” అంటూ ఆఫ్రికా అందాలను రాజమౌళి వివరించారు. ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన ఈ తాజా వ్యాఖ్యలు, సినిమా విజువల్స్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

