కలం, వెబ్ డెస్క్: వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. విశాఖకు కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచానికి పర్యాటక కేంద్రంగా వైజాగ్ ఎదగాలని.. మరో దుబాయ్ కావాలని ఆకాంక్షించారు. ఇనార్బిట్ మాల్‌లో AAA సినిమాస్‌ను అల్లు అర్జున్ ప్రారంభించి మాట్లాడారు.
మాల్ అంటే కేవలం కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రమే కాదని.. అది కల్చర్‌లో భాగమవుతుందన్నారు. నగర వాసులకు ఇదొక మంచి అనుభూతిని ఇస్తుందన్నారు. ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా మోడర్న్ టెక్నాలజీతో AAA సినిమాస్ రూపొందించినట్లు.. దీన్ని వైజాగ్ సిటీకి అంకితమస్తున్నట్లు అల్లు అర్జున్ వివరించారు. ‘ఇది మన బ్రాండ్..’ అంటూ పుష్ప స్టైల్లో చెప్పి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు.
ఫ్యాన్స్‌కు నో చెప్పడం రాదు..
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ఫొటోలు దిగుతామని అడగడంతో అల్లు అర్జున్ వెంటనే అంగీకరించి.. స్టేజీపైకి రావాలని కోరారు. ఫ్యాన్స్ కు నో చెప్పడం రాదని నవ్వుతూ.. వచ్చినవారికి సెల్ఫీలు ఇచ్చారు. ‘రాకా’ మూవీ అప్డేట్ గురించి అడగ్గా.. ప్రస్తుతం బాంబేలో షూటింగ్ జరుగుతోందని అక్కడి నుంచే వైజాగ్‌కు వచ్చినట్లు వివరించారు. ఈవెంట్ సాఫీగా జరిగేందుకు పోలీసులు పూర్తిగా సహకరించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

