Mobile Popup Ad
Mobile Popup Ad

“వెంకీ” 22 ఏళ్లు పూర్తి.. శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్ట్

కలం, సినిమా : స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla), మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కాంబినేషన్‌లో వచ్చిన “వెంకీ” (Venky) సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ, శ్రీను వైట్ల కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. 2004లో వచ్చిన ఈ సినిమా నేటికీ (మార్చి26)  22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. వెంకీ మూవీ రిలీజ్ అయి 22 ఏళ్లు పూర్తైందంటే నమ్మలేకపోతున్నానని శ్రీను వైట్ల తెలిపారు.

“వెంకీ” సినిమా కేవలం సినిమా కాదు, అది మన ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపిన ఒక మరిచిపోలేని, ఆనందకరమైన ప్రయాణమని తెలిపారు. మొత్తం 70 రోజుల షూటింగ్ షెడ్యూల్‌లో 40 రాత్రులు నిరంతరంగా షూట్ చేయడం ద్వారా నిజమైన రాత్రి విజువల్ ఎఫెక్ట్స్ సాధించగలిగాము. ఇది సాధ్యమైందంటే నా హీరో రవి తేజ అద్భుతమైన సపోర్ట్, డెడికేషన్ వల్లనే అని ఆయన పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణ చంద్ర రావుకి శ్రీనువైట్ల (Srinu Vaitla) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘వెంకీ’ సినిమా విడుదల సమయంలో, రీ-రిలీజ్ సమయంలో అభిమానులు  చూపిన ప్రేమకు, ప్రతి చోటా అందిన స్పందనకు శ్రీనువైట్ల కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>