Mobile Popup Ad
Mobile Popup Ad

ఒప్పందంపై లేట్ చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ దేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఒప్పందం కోసం తమను ప్రాధేయపడుతోందని.. కానీ సీరియస్ గా నిర్ణయం తీసుకోవట్లేదని తెలిపారు. ఇరాన్ దగ్గర చెప్పుకోడానికి ఏమీ మిగల్లేదని.. ఆ దేశం ఆర్మీ, ఆయుధాలను పూర్తిగా నాశనం చేశామని ట్రంప్ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ కోలేకోలేనంత నష్టపోయిందని.. కాబట్టి అమెరికా ప్రతిపాదనను ఇంకా పరిశీలిస్తూ లేట్ చేయొద్దన్నారు.

ఇరాన్ కు (Iran) తమ ప్రతిపాదనను ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదని.. ఆలస్యం చేస్తే అమెరికా దాడులు మళ్లీ మొదలు పెడుతుందని హెచ్చరించారు ట్రంప్. ఒకసారి మొదలు పెడితే ఇక వెనక్కు తిరిగి చూసేది లేదని.. కాబట్టి తన మాటలను ఇరాన్ సీరియస్ గా తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ (Trump) తేల్చి చెప్పారు.

Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>