Mobile Popup Ad
Mobile Popup Ad

ఏలేశ్వర స్వామి భక్తులకు శుభవార్త.. దర్శనానికి లాంచీ సేవలు

కలం, నాగార్జునసాగర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ (Nalgonda) జిల్లాలోని ఏలేశ్వర స్వామి (Yeleswaram Temple) దర్శనానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక లాంచీ సౌకర్యాన్ని కల్పించింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం శివరాత్రి రోజున ఉదయం 6 గంటల నుండే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రయాణానికి సంబంధించి పెద్దలకు 250 రూపాయలు, పిల్లలకు 200 రూపాయలుగా టికెట్ ధరలను నిర్ణయించారు. భక్తులు ఏలేశ్వర మల్లన్నను (Yeleswaram Temple) దర్శించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. తెలంగాణ పర్యాటక సంస్థ నల్గొండ జిల్లా హిల్ కాలనీ నుండి లాంచీలను నడుపుతుండగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు సాగర్ సమీపంలోని అనుపు ప్రాంతం నుండి బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏటా శివరాత్రి, తొలి ఏకాదశి పర్వదినాల్లో మాత్రమే ఈ ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

 Read Also: స్కూల్ మారుతాన‌న్న‌ విద్యార్థి.. చితకబాదిన వార్డెన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>