కలం, వెబ్ డెస్క్: ప్రేమికుల రోజు(Valentines Day)న ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా బయటకు వెళ్లిన ఓ ప్రేమ జంటను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు విడదీసింది. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. ప్రేమికుల రోజు సందర్భంగా యువతి రిషిక తిరుపతి నుంచి తన ప్రియుడితో కలిసి కడపలోని (Kadapa) గండికోటకు బైక్‌పై బయలుదేరింది. ఆలంఖాన్‌పల్లె సమీపంలో వీరు వెళ్తున్న బైక్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని కడప రిమ్స్‌కు తరలించారు. ప్రేమికుల రోజున ఇలాంటి ఘటన జరగడం, ప్రియురాలు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Also: ఏపీ గ్రూప్ 1 అక్రమాలపై సిట్
Follow Us On: Sharechat


