డయాబెటిస్ రోగులలో పి.ఎ.డి ప్రమాదం : డా. ప్రభాకర్ హెచ్చరిక

కలం, కరీంనగర్ బ్యూరో : డయాబెటిస్ రోగులలో పెరిఫరల్ ఆర్టెరియల్ డిసీజ్ (PAD Risk) పై అవగాహన అత్యవసరమని డాక్టర్ ప్రభాకర్(Dr Prabhakar) తెలిపారు. కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ సమస్యను సమయానికి గుర్తించకపోతే కాళ్లకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ..  డయాబెటిస్ ఉన్నవారిలో పి.ఎ.డి సమస్య (PAD Risk) వేగంగా పెరుగుతోందని వివరించారు. కాళ్లకు వెళ్లే రక్తనాళాలు ఇరుకుగా మారడం లేదా మూసుకుపోవడం వల్ల రక్తప్రసరణ తగ్గిపోతుందని తెలిపారు.

దీని కారణంగా చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందని, నరాల సమస్యల వల్ల కొందరికి నొప్పి కూడా తెలియకపోవచ్చని ఆయన హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్ల నొప్పి, అలసట, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్షలు, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షల ద్వారా సమస్యను ముందుగానే గుర్తించవచ్చని చెప్పారు. అలాగే రక్త చక్కెర నియంత్రణ, పొగత్రాగడం మానడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించారు. అవసరమైతే మందులు, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ప్రతి రోజు పాదాలను పరిశీలించడం, గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ముందస్తు అవగాహనతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా వాసులకు ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యశోద మెడికల్ సెంటర్‌లో ఓపిడీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్‌తో పాటు యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ సిబ్బంది నవీన్ చక్రవర్తి, శ్రీకాంత్ పాల్గొన్నారు.

 Read Also: ప్రధాని మోదీ ఉగ్రవాది.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>