Mobile Popup Ad
Mobile Popup Ad

మరో సకల జనుల సమ్మెగా ఆర్టీసీ సమ్మె..TGSRTC ప్రకటన

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె (TGSRTC Strike).. మరో సకల జనుల సమ్మెగా మారబోతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న హెచ్చరించారు. బుధవారం (ఏప్రిల్ 22) నుంచి తాము చేపట్టబోయే సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని తెలిపారు. ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపలేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలుపెట్టలేదని.. కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారని.. ఆర్టీసీని (TGSRTC) మాత్రం సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సీఎం రేవంత్ చెబుతున్నారని, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మూసీ నదిని అభివృద్ధి ఎలా చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆర్టీసీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 Read Also: ప్రధాని మోదీ ఉగ్రవాది.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>