కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహ వేడుకల ఖర్చును మేఘా కృష్ణా రెడ్డికి చెందిన షెల్ కంపెనీల ద్వారా చెల్లించారనే ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలక్ నుమా ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ ఖరీదైన వివాహానికి సంబంధించి అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నారాయణపేట జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై గతంలోనే ఆయన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) కి ఫిర్యాదు చేయగా, చర్యల నిమిత్తం ఆ ఫిర్యాదును తెలంగాణ ప్రభుత్వానికి పంపారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో, శ్రీనివాస్ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో పిటిషన్ దాఖలు చేసి సిబిఐ విచారణ కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ఫిర్యాదుదారుడి ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని మూడు వారాల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Also: యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి: మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: Instagram

