epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జైస్వాల్ జైత్రయాత్ర.. కంగారులో కరేబియన్స్

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భారత బ్యాటర్లు దూకుడుగా రాణిస్తున్నారు. వీరిలో యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) జైత్రయాత్ర చేస్తున్నాడు. కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. తొలి రోజే శతకం బాదాడు. సాయి సుదర్శన్.. తానేం తక్కువ కాదన్నట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది.

ఆరంభం నుంచి కూడా జైస్వాల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 145 బంతుల్లోనే సెంచరీ కొట్టి ఔరా అనిపించాడు. ప్రస్తుతం జైస్వాల్ 173 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రెండో రోజు ఆటలో కాస్తంత చూసుకుని ఆడితే డబుల్ సెంచరీ చేసేయొచ్చు. జైస్వాల్‌కు టెస్ట్ కెరీర్‌లో ఇది ఏడో సెంచరీ. టెస్ట్‌లలో తొలిరోజే 150కిపైగా పరుగులు చేయడం జైస్వాల్‌కు ఇది రెండోసారి. జైస్వాల్ ఇన్నింగ్స్‌లో మొత్తం 22 ఫోర్లు ఉన్నాయి. దీంతో జైస్వాల్(Yashasvi Jaiswal) జైత్రయాత్రకు బ్రేకులు వేయడమే ప్రస్తుతం వెస్టిండీస్ బౌలర్ల ముందు ఉన్న ఫస్ట్ టార్గెట్. దానిని సాధించడం కోసం రేపు ఏమాత్రం బౌలింగ్ వేరియేషన్స్ చూపుతారో చూడాలి.

Read Also: స్మృతి మందాన.. చేసింది తక్కువ స్కోరే అయినా రికార్డ్..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>