రిజర్వేషన్ల అంశంపై ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు(TG High Court) కీలక సూచనలు చేసింది. 50 శాతం రిజర్వేషన్ దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని పేర్కొంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై ఇటీవల హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై న్యాయస్థానం శుక్రవారం అర్థరాత్రి సమగ్ర తీర్పు కాపీని విడుదల చేసింది.
సుప్రీం కోర్టులో ఉన్న నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు సూచించింది. పెంచిన 17% రిజర్వేషన్లను ఓపెన్ కేటగిరీగా ప్రకటిస్తూ రీ నోటిఫై చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని, ఎన్నికలు నిలిపివేయాలని తమ ఉద్దేశం కాదని, జీవో మార్పును మాత్రమే ప్రతిపాదిస్తున్నామని తెలంగాణ హైకోర్టు(TG High Court) స్పష్టం చేసింది.
Read Also: ‘కాంతార-1’ రికార్డ్.. ఆ క్లబ్‌లో చోటు..

