epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టాక్సిక్ లో ఇంకెంతమంది హీరోయిన్స్​ ?

కలం, వెబ్​ డెస్క్​ : కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న కొత్త సినిమా టాక్సిక్ : ఎ ఫేరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ (Yash Toxic Movie) అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. కేజీఎఫ్ రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యశ్ చేస్తున్న చిత్రంగా టాక్సిక్ మూవీ మీద కన్నడ నాట భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా బాగుంటే పాన్ ఇండియా స్థాయిలోనూ ఈ మూవీ ఓ రేంజ్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంటుంది. కేజీఎఫ్ సినిమాలతో యశ్ ఆ బాక్సాఫీస్ బేస్ ను రెడీ చేసుకుని ఉన్నాడు కాబట్టి యశ్ టాక్ మీదే ఆ సినిమా పాన్ ఇండియా కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి.

ఇక ఈ సినిమా పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. అయితే ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్స్ ను పెద్ద సంఖ్యలో పెట్టుకోవడమే ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే కియారా అద్వానీని నదియాగా, తారా సుతారియాను, రెబెకాగా, హ్యూమా ఖురేషిని ఎలిజబెత్ గా, నయనతారను గంగ పాత్రలో పరిచయం చేశారు. వీరి క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రుక్మిణీ వసంత్ ను మెలిసాగా పరిచయం చేశారు. ఈ రోజు రుక్మిణీ వసంత్ పుట్టినరోజు సందర్భంగా ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఈ గ్యాంగ్ స్టర్ కథలో ఐదుగురు హీరోయిన్స్ అంటే వాళ్ల క్యారెక్టర్స్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఐదు పాత్రలు బలంగా ఉంటే ఇక కథలో హీరో క్యారెక్టర్ కు స్పేస్ ఎక్కడ ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. యశ్ ఎంతో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న మూవీ ఇది. కేజీఎఫ్ సినిమాల తర్వాత తనపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను రీచ్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని ఆయన చెబుతున్నారు. యశ్ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత డైరెక్టర్ గీతూ పైనే ఉంది. రుక్మిణీ వసంత్ కు కూడా టాక్సిక్ మూవీ కీలకం కానుంది. ఆమె ఇటీవల కాంతార ప్రీక్వెల్ తో హిట్ కొట్టింది. ఈ సినిమా తెలుగులోనూ ఆదరణ పొందిన నేపథ్యంలో రుక్మిణీ తన టాలీవుడ్ జర్నీపై హోప్స్ పెంచుకుంది. టాక్సిక్ తెలుగులో కూడా హిట్ అయితే రుక్మిణీ క్రేజ్ మరింత పెరిగినట్లే అనుకోవాలి. Yash Toxic Movie మార్చి 19 వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి.. ఈ మూవీ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

Read Also: ఫ్యాన్ గర్ల్ తో ప్రభాస్ .. లేటెస్ట్ క్లిప్ వైరల్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>