కలం, వెబ్ డెస్క్ : జాతీయ రహదారుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే 2026–27 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న పదిహేడు జాతీయ రహదారులను ప్రైవేటీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ జాబితాలో తెలంగాణలోని కీలకమైన రహదారి చోటు సంపాదించుకుంది.
రాష్ట్రంలోని ఎన్‌హెచ్–163 పరిధిలో గల యాదాద్రి–వరంగల్ సెక్షన్‌లోని 99.1 కిలోమీటర్ల హైవే (Warangal Highway)ను ప్రైవేటుకు కట్టబెట్టనున్నారు. దీనితో పాటు ఈ మార్గంలో ఉన్న కోమళ్ల, కోమటిపల్లి టోల్ ప్లాజాల నిర్వహణ బాధ్యతలను సైతం ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. ఈ ప్రణాళికలో కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా దేశంలోని పలు ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. హరియాణ, జార్ఖండ్ రాష్ట్రాల నుండి మూడు చొప్పున జాతీయ రహదారులు ప్రైవేట్ పరం కానున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి రెండు చొప్పున, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల నుండి ఒక్కో హైవేను ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.
Read Also: వలసదారులపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

