Mobile Popup Ad
Mobile Popup Ad

వలసదారులపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో మారుతున్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హర్షం వ్యక్తం చేశారు. గతంలో మమతా బెనర్జీ పాలనలో నిత్యం చొరబాట్లు జరిగేవని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం వలసదారులు తమంతట తామే స్వచ్ఛందంగా వెనక్కి వెళ్తున్నారని చెప్పారు. అలా వెళ్లేవారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. అయితే స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు.

మరోవైపు సరిహద్దుల్లో ఫెన్సింగ్ (కంచె) పనుల అడ్డంకులు తొలగిపోవడంపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మౌలిక వసతుల బలోపేతం కోసం కేవలం వారం రోజుల్లోనే 600 హెక్టార్ల భూమిని కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆయన అభినందించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఫెన్సింగ్ పనులకు అడ్డంకులు తొలగిపోయాయన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>