బట్టలు త్వరగా పాతబడుతున్నాయా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

కలం, వెబ్‌డెస్క్: మనం ఎంతో ఇష్టపడి, వేల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కునే దుస్తులు (Clothes) కేవలం కొన్ని రోజుల్లోనే రంగు వెలిసిపోతే లేదా పాడైపోతే ఎంతో బాధేస్తుంది. దుస్తుల మన్నిక అనేది కేవలం వాటి నాణ్యత (Quality) పైనే కాదు, వాటిని మనం ఎలా వాడుతున్నాం, ఎలా సంరక్షిస్తున్నాం (Maintenance) అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది.చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మనకు నచ్చిన బట్టలను ఎక్కువ కాలం కొత్త వాటిలా మెరిసేలా చూసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. దుస్తులను సరిగ్గా ఉతకడం, ఆరబెట్టడం, భద్రపరచడం ద్వారా వాటి లైఫ్ టైమ్‌ను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  1. చల్లని నీటిలోనే ఉతకడం

చాలామంది బట్టలను వేడి నీళ్లలో నానబెట్టి ఉతుకుతుంటారు. బాగా మురికిగా ఉన్న వాటికి ఈ చిట్కా ఉపకరిస్తుంది. కానీ వాటితో పాటే మిగతా దుస్తుల్ని కూడా వేడినీటిలో ఉతకడం పొరపాటు. ఇలా చేయడం వల్ల వాటి నాణ్యత దెబ్బతింటుంది. కొన్ని దుస్తులకైతే దారాల పోగులు బయటికొచ్చేయడం, ముడుచుకుపోవడం.. గమనించచ్చు. కాబట్టి రోజూ వేసుకునే దుస్తుల్ని చల్లటి నీటిలో నానబెట్టి ఉతకడం మంచిది.

2. దుస్తులను తిరగేసి ఆరేయాలి

ఉతికిన బట్టల్ని తిరగేసి, ముడతల్లేకుండా ఆరేయాలి. ఇలా చేయడం వల్ల బట్టలు ఎండకు రంగు కోల్పోకుండా ఉంటాయి.

3. లేబుల్స్ ఆధారంగా

బట్టలు (Clothes) కొన్నప్పుడు వాటికి కొన్ని లేబుల్స్ ఉంటాయి. ఇంటికొచ్చాక వాటిని కత్తిరించి పక్కన పడేయకుండా ముందు దాని మీద ఇచ్చిన వివరాలను ఓసారి గమనించండి. దీని వల్ల ఆ బట్టలను డ్రైవాష్ చేయాలా? వాషింగ్మెషీన్లో వేయాలా? లేక చేత్తో ఉతకాలా? నీడలో ఆరేయాలా లేక ఎండలోనా? వంటి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే వాటిని ఇస్త్రీ చేయచ్చా? లేదా? కూడా తెలుస్తుంది. ఆ వివరాల ఆధారంగానే దుస్తుల్ని శుభ్రం చేస్తే అవి ఎక్కువ కాలం మన్నుతాయి.

4. కెమికల్స్ వద్దు

బట్టలకు ఉన్న మురికి తొందరగా వదిలిపోయి అవి తళతళా మెరిసిపోవాలని ఉతికే నీళ్లలో క్లోరిన్, బ్లీచ్ వంటివి కలుపుతుంటారు కొందరు. నిజానికి వీటి వల్ల దుస్తుల నాణ్యత తగ్గిపోతుంది. ఫలితంగా బట్టలు త్వరగా చిరిగిపోతాయి. అందుకే వీటికి బదులు వినెగర్ని ఉపయోగించడం మంచిది. వినెగర్ దుస్తులకు కొత్త మెరుపునూ అందిస్తుందట!

5. మరకలు పడిన వెంటనే

బట్టల మీద మరకలు పడిన వెంటనే వాటిని పోగొట్టే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా ఉతికే సమయంలో చూసుకుందామని వదిలేస్తే ఆ మరకలు మరింత కఠినంగా మారి ఎంత రుద్దినా వదలవు. ఫలితంగా ఆ ప్రదేశంలో రంగూ కోల్పోతాయి.

6. గాఢత తక్కువగా..

బట్టలు ఉతకడానికి ఉపయోగించే సబ్బులు తక్కువ గాఢత కలిగినవైతే మంచిది. ఎక్కువ గాఢత ఉన్న సబ్బులు, డిటర్జెంట్లను ఉపయోగించడం.. మురికి తొందరగా పోవాలని ఎక్కువ మొత్తంలో వాటిని వాడటం వంటివి చేయడం వల్ల దుస్తుల నాణ్యత దెబ్బతింటుంది.

Read Also: అరటి తొక్కతో చర్మానికి ఇంత మేలు జరుగుతుందా? షాకింగ్ బ్యూటీ టిప్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>