కలం, యాదగిరిగుట్ట : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయంలో సోమవారం బహుళ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష పుష్పార్చన పూజలను వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ అర్చకులు విశిష్ఠతను తెలియజేశారు.
బహుళ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో యాదాద్రీశునికి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలను ఘనంగా జరిపించారు. సుమారు గంట పాటు ఆలయ (Yadadri) అర్చకులు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల, సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ నరిసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
Read Also: తేనె పవర్ అంతా ఇంతా కాదు.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
Follow Us On: X(Twitter)

