అశ్వరావుపేట తెలంగాణ ముఖ ద్వారం: మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట (Aswaraopeta Municipality) మున్సిపాలిటీ తెలంగాణకు ముఖ ద్వారం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) అన్నారు. సోమవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు దమ్మపేట మండలం గండుగులపల్లిలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… అశ్వరావుపేట ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటం వలన, మన రాష్ట్రానికి ఇది ముఖ ద్వారమని, ఏపీ వైపు నుంచి వచ్చే వారు తెలంగాణలోకి ప్రవేశించగానే అశ్వారావుపేట పట్టణం ఎంతో ఆహ్లాదకరంగా, అందంగా కనిపించేలా సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా అశ్వారావుపేట ముందు ఉండాలని మంత్రి (Minister Tummala) స్పష్టం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు వార్డుల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ, మున్సిపల్ కమిషనర్‌తో సమన్వయం చేసుకుంటూ పనుల్లో వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని తమ సమస్యలను మంత్రికి వివరించారు.

Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>