టీసీఎస్‌లో లైంగిక వేధింపులు.. విచారణకు ఆదేశించిన సంస్థ చైర్మన్

కలం, వెబ్‌డెస్క్ : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటి అయిన టాటా కన్సల్టెన్సీ కంపెనీలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడికి సంబంధించిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ (TCS Nashik) శాఖలో జరిగిన పరిణామాలపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్పందించారు. టీసీఎస్ నాసిక్ బ్రాంచ్ లో వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళనకరమైనవని, భాదాకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలపై నిజనిర్ధారణ చేయడానికి, బాధ్యులను గుర్తించడానికి టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసినట్లు ఆయన ప్రకటించారు.

ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నమని చెప్పారు. నిందితులైన ఉద్యోగులపై ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసుల విచారణకు కంపెనీ పూర్తిగా సహకరిస్తోందని ఎన్. చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. కాగా, ఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఏడుగురు ఉద్యోగులను తొలగించింది. కాగా, నాసిక్ టీసీఎస్ (TCS Nashik) కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతం మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. నాసిక్ క్యాంపస్ లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహ ఉద్యోగిపై కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశారని ఆమె ఫిర్యాదు చేయడంతో.. మరో ఏడుగురు మహిళా ఉద్యోగులు ముందుకొచ్చి తమపై జరుగుతున్న వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టి కేసు నమోదు చేశారు.

Read Also: తేనె పవర్ అంతా ఇంతా కాదు.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>