Mobile Popup Ad
Mobile Popup Ad

రిటైర్డ్ పోలీస్ అధికారులకు యాదాద్రి భువనగిరి ఎస్పీ సన్మానం

కలం, యాదాద్రి భువనగిరి : పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించి, తమ విధి నిర్వహణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇద్దరు ఏఎస్ఐల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం శనివారం యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. బీబీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించిన ఏఎస్ఐ రవి కుమార్, అలాగే ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించిన ఏఎస్ఐ కేశవరెడ్డి పోలీస్ సర్వీస్ నుండి పదవీ విరమణ పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి, విజయవంతంగా పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో వారు అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారి నూతన జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా సాగాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అడీషనల్ ఎస్పీ, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read Also: విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>