కలం, వెబ్ డెస్క్: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ (DK Shivakumar) జూన్ 3వ తేదీన సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు లోక్‌భవన్ ప్రకటన విడుదల చేసింది. లోక్‌భవన్ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ తనకు రాసిన లేఖ అందిందని గవర్నర్ పేర్కొన్నారు. అంతకుముందు పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో డీకే.శివకుమార్‌ను తమ నాయకుడిగా ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మాజీ సిద్ధరామయ్యనే ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడం గమనార్హం.
8 మంది కొత్త మంత్రులు..?
డీకే.శివకుమార్‌తో పాటు ఎనిమిది మంది కొత్త మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన వర్గం వారితో పాటు సిద్ధరామయ్య ప్రతిపాదిస్తున్న యతీంద్ర, సతీశ్ జక్రీహోలీని కూడా కేబినెట్‌లోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

