కలం, వెబ్ డెస్క్ : బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సీఎం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఏడాదికి రూ. 70 వేల కోట్లు అప్పు చేస్తే రూ. 95 వేల కోట్ల అప్పు తీరుస్తున్నామని చెప్పారు. తాము తీరుస్తున్న అప్పుల గురించి హరీశ్ రావు (Harish Rao) ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రూ. 54 వేల కోట్ల అప్పులు తీసుకుంటామని ముందే చెప్పామని సీఎం గుర్తు చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేయడానికి అనుమతి లేదని వెల్లడించారు.
‘కేసీఆర్ మీద ఒట్టు వేసి బీఆర్‌ఎస్‌లోనే ఉంటా అని హరీశ్ రావు చెప్పాలి. గతంలో వైఎస్ రాజశేఖర్ దగ్గరికి హరీశ్ రావు వెళ్లాడు. ఆయన ఎవరెవరి తో మాట్లాడుతున్నాడో నాకు తెలుసు.. కానీ నేను చెప్పను. పార్టీ మీటింగ్ వదిలేసి హరీశ్ రావు ఎందుకు ఢిల్లీకి వెళ్లాడు?. ప్రాథమిక ఆధారాలతో రెండు కేసులు సీబీఐకి ఇచ్చాను.. వీటిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి’ అని రేవంత్ ప్రశ్నించారు.
2034 వరకు తెలంగాణ లోనే ఉంటా..
2034 వరకు తెలంగాణలోనే ఉంటానని.. ప్రజలకు మేలు చేయాలన్నదే ఆలోచన అని సీఎం రేవంత్ స్పష్టం లేదన్నారు. తనలో చిన్న మార్పు కూడా లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ది తనది విజయవంతమైన కాంబినేషన్ అని.. ఇద్దరి కాంబినేషన్ లో అన్ని ఎన్నికలు గెలిచామన్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే ఎన్నికలల్లో కూడా గెలుస్తామని ముందే చెప్పానని రేవంత్ గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహేశ్ గౌడ్‌కి మంచి పదవి రావొచ్చని సీఎం రేవంత్ అంచనా వేశారు.
Read Also: కరీంనగర్ గడ్డ.. కమలం అడ్డా: బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు
Follow Us On: Instagram

