విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు

కలం, వెబ్‌ డెస్క్ : కర్నూల్ జిల్లా మంత్రాలయం (Mantralayam) వద్ద విషాదం చోటు చేసుకుంది.
తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువుల ఇంట్లో పూజకు వెళ్లిన అనంతరం వీరందరూ ఈతకు వెళ్లారు. నదిలోకి దిగిన వీరు లోతును అంచనా వేయలేక మునిగిపోయారు. గల్లంతయిన వారిలో సంధ్య (22), యువన్ చంద్ర (5), సతీశ్ (35), ధను (23), రాఘవేంద్ర (25) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఒకరి మృతదేహం లభించినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>