కలం, యాదాద్రి భువనగిరి: పోలీస్ అంటే శాంతిభద్రతలను పరిరక్షించడమే కాదు.. చనిపోతూ కూడా పదిమంది జీవితాల్లో వెలుగులు నింపే పౌరుడు అని నిరూపించాడీయన. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన కంబాల శంకర్ (31) మల్కాజిగిరి కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా (Constable) విధులు నిర్వహిస్తున్నాడు.
గత నెల తుర్కపల్లిలోని తన స్నేహితుని ఇంటి వద్దకు వెళ్లి, తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్రంగా గాయం కావడంతో వెంటనే స్థానికులు ఎయిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం యశోదలో చేర్పించగా, చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. అతని మరణంతో కుటుంబసభ్యులు, తోటి పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. తన మరణాంతరం అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు శంకర్ మంచితనాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.

